Advertisement

అంబటి రాంబాబు పై దాడి చేసిన వారిపై అరెస్టు చేయాలి

  • కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులను తొలగించాలి
  • ప్రతిపక్ష నాయకులకు రక్షణ లేదు
  • పిఠాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ వంగా గీత

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02 : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని మాజీ పార్లమెంట్ సభ్యురాలు, పిఠాపురం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీత ఆరోపించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతుందని మండిపడ్డారు. అసత్యాలను ప్రసారం చేస్తూ గోరంట్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పై పోలీసుల సమక్షంలో టిడిపి గుండాలు దాడికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. ఆయన ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టడం సంఘటను తీవ్రంగా ఆరోపించారు. బాధితుడైన అంబటి పై తిరిగి కేసులు నమోదు చేయడాన్ని ఖండించారు. అలాగే మాజీమంత్రి జోగి రమేష్ ఇంటికి టిడిపి గుండాలు నిప్పు పెట్టడాన్ని కూడా వంగా గీత ఖండించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *