- కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : కార్తిక వన సమారాధనలతో సమాజంలో ఆధ్యాత్మిక వాతావరణం పెరగడంతో పాటు ఆహ్లాదం లభిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆలమూరులో సూరపురెడ్డి (బట్టి) సూర్యనారాయణ, వారి కుమారుల ఆధ్వర్యంలో జరిగిన కార్తిక వన సమారాధనలో ఆయన పాల్గొన్నారు. అందరూ ఒక చోట చేరి సహపంక్తి భోజనాలు చేయడానికి వన సమారాధనలు దోహదం చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, సలాది నాగేశ్వరరావు, ఈదల రాంబాబు, కేతా రాంబాబు, ఈదల నల్లబాబు తదితరులు పాల్గొన్నారు.

















Leave a Reply