వారు చెబితేనే పనులవుతాయా, పరిస్థితి చక్కదిద్దాలి
ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు
మంగళగిరి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యే తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజల ఆస్తి వివాదాల్లో తల దూర్చుతున్నారని, ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సూచించారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని, పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాలని కోరారు. పవన్ వ్యాఖ్యల పైన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ఎవరైనా ఎమ్మెల్యేలు గీత దాటితే కఠినంగా ఉండాలని, వారి విషయంలో ఇంఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసారు. డిప్యూటీ సీఎం పవన్ వివాదాల్లో తల దూర్చుతున్న ఎమ్మెల్యేల తీరు పైన మండిపడ్డారు. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో పవన్ ఈ అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెబుతోందని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
















Leave a Reply