Advertisement

క్లబ్ సభ్యులకు బీమా, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం ఏర్పాటుకు కృషి

  • క్లబ్ అధ్యక్షులు ప్రవీణ్ గుప్తా

కాకినాడ రూరల్, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : ప్రెస్ క్లబ్ ఆఫ్ కాకినాడ రూరల్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుప్తా(Tv5) ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకున్న కమిటీతో సభ్యుల మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పటల్లో వైద్య సహాయం ఏర్పాటుకు కృషి చేస్తానని, అదే విధంగా జర్నలిస్టులకు ఆరోగ్య భీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధుల సంక్షేమంతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో క్లబ్ సెక్రటరీ జి.శ్రీనివాస్ (కోస్తా ఎన్కౌంటర్), ట్రెజరర్ సాయిరాం (ఆంద్ర జ్యోతి), వైస్ ప్రెసిడెంట్ లు ధర్మరాజు (ఆంధ్ర ప్రభ), పలివెల శ్రీనివాస్ (ఇమేజ్ న్యూస్), జాయింట్ సెక్రటరీలు పెంకే శ్రీనివాస్ (Big Tv), వి.చక్రరావు, గౌరవ సలహాదారులు మూర్తిబాబు (ఈనాడు), శ్రీ రామమూర్తి (ఆంద్ర జ్యోతి), రాజబాబు (సాక్షి) క్లబ్ సభ్యులు రాజ్ కుమార్ (యు.సి.సి), ప్రసాద్ (ప్రజా శక్తి), కుమార్ (విశాలాంధ్ర), మోహన్ కుమార్ (అభయ్), అనిల్ (Prime 9), చందూ (4 షేడ్స్) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *