కిర్లంపూడి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు నీలం సూరిబాబు సతీమణి గోనేడ మాజీ సర్పంచ్ నీలం వెంకయ్యమ్మ (బేబీ) ఇటీవల మరణించడంతో శనివారం గోనేడలోని వారి స్వగృహంలో బేబీ చిత్రపటానికి కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు నీలం సురేంద్రను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి నీలం శ్రీను, నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు అనుకూల శ్రీకాంత్, తూము కుమార్, గోకాడ సత్యనారాయణమూర్తి, మాదారపు జేజేలు తదితరులు పాల్గొన్నారు.
గోనేడ మాజీ సర్పంచ్ నీలం వెంకయ్యమ్మ (బేబీ) కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్
















Leave a Reply