Advertisement

గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ఉద్ఘాటన

మార్కాపురం జిల్లా ప్రతి నిధి, సింహగర్జన (ముత్యాల నరేష్ రెడ్డి) జనవరి 06 : సొసైటీ కాలనీ మదనపల్లి నగరం అన్నమయ్య జిల్లాలో విలేజ్ న్యాచురల్స్ గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ఉద్ఘాటన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ రామ్ మూర్తి మరియు బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి విచ్చేసారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాంతారాం వైద్యశాల అధినేత డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా సంయోజక ఈశ్వర్ రెడ్డి మరియు బంధు మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రాంత ఆరోగ్య ప్రముఖ్ రామ్ మూర్తి మాట్లాడుతూ దేశవాళి వరి వంగడాలు మరియు చిరుధాన్యాలు వాటి ఉపయోగం, ఆరోగ్య విలువలు గురుంచి వివరంగా తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *