రాజమహేంద్రవరం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నాట్యం మోక్ష సాధనం అనే సంకల్పంతో శ్రీ శివ సాయి కూచిపూడి కళాక్షేత్రం నిర్వహికురాలు కళా తపశ్వి తణుకు సాయి మాధవి ఆధ్వర్యంలో చిన్నారులు , విద్యార్థిణిలతో అంగ రంగ వైబవొత్సవంగా కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీ శివ సాయి కూచిపూడి కళాక్షేత్రం తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో సాయి మాధవి విద్యార్థిణిలో కూచిపూడి నాట్య ప్రదర్శనలు చేస్తు వారి వారి ప్రతిభలను చాటుకున్నారు. వారి నాట్య ప్రదర్శనలు చూసిన గురువులు ఎంతో అబ్బుర పడి సాయి మాధవిని కితబులతో ముంచెత్తారు. కళలకు ఎంతో ప్రసిద్ధి గాంచిన సాహితీ నగరం రాజమహేంద్రవరంలో ఇంత గొప్ప కళాక్షేత్రం నిర్వహిస్తు కూచిపూడి కళకు జీవం పోస్తున్న సాయి మాదవి సేవలను పలువురు కొనియాడారు. ఎంతో మంది చిన్నారులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తు ఈ కళ సాంప్రదాయాలను, ప్రత్యేకతను, హిందూ ధర్మ గొప్పతనాన్ని జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతున్న ఈ కళాక్షేత్రం భవిష్యత్ లో రాష్టపతి అవార్డును సొంతం చేసుకోవటం ఖాయమని పలువురు వక్తలు ఆశాభావం వ్యక్త పరిచారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ కళాక్షేత్రం నుండి మంచి మంచి అవార్డులు, మెమోంటోలు దక్కించుకున్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పెద్దలు, గురువులు, విద్యార్థిణిల తల్లిదండ్రులు పాల్గొని ఎన్నెన్నో వారి ఆనందాలను పంచుకున్నారు.
ఘనంగా శ్రీ శివ సాయి కూచిపూడి కళాక్షేత్రం తృతీయ వార్షికోత్సవ సభ
















Leave a Reply