- చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు.. మీరు ముద్దాయిలు కావద్దు
- డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్
మార్కాపురం జిల్లా ప్రతినిధి, సింహగర్జన ప్రతినిధి (ముత్యాల నరేష్ రెడ్డి) జనవరి 17 : చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలని చూసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యకు గురికాక తప్పదని కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు. శనివారం పామూరు పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిఐ మాకినేని శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా అనూక్ తో కలిసి ఆయన మాట్లాడుతూ మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో గురువారం సాయంత్రం ఆటో డ్రైవర్ పై బొట్లగూడురు గ్రామస్తులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. ముద్దాయిలెంతటివారైనా ఉపేక్షించేది లేదని సంఘటన జరిగిన వెంటనే సిఐ శ్రీనివాసరావు, ఎస్సైఅనూక్ స్పందించి ఆరుగురు ముద్దాయిలను అదుపులో తీసుకున్నామన్నారు. మరో నలుగురు కోసం గాలిస్తున్నామన్నారు. పీసీపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మహర్షి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో బొట్లగూడరులో సెంటర్ వద్ద మద్దినేని తిరుపతి అనే వ్యక్తికి ఆటో తగలడం వల్ల గాయం అయిందని, గాయపడిన తిరుపతయ్యతో పాటు పలువురు గ్రామస్తులు మహర్షిని ఇనుప పోలుకు కట్టివేసి విచక్షణా రహితంగా దాడి చేయడం అమానుష చర్య అన్నారు. కేవలం క్షణికావేశంలో మహర్షి పై దాడి చేయడం జరిగిందే తప్ప, రజక కులం అని తెలిసి అగ్రవర్ణాల దాడి చేయడం అన్నది కొందరు చేస్తున్న కేవలం కల్పితమేనన్నారు. బొట్లగూడూరులో జరిగిన ఘర్షణలో ఎటువంటి పాత కక్షలు లేవని, దీనిపై కులాలను ఆపాదించవద్దని డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ కోరారు. అదేవిధంగా జరిగిన ఘర్షణలను వీడియో తీస్తున్నారన్న నేపంతో బోట్లగూడూరు గ్రామానికి చెందిన ఒక కులస్తులు దూషించిన సంఘటనలో మరోసారి ఘర్షణ జరిగిందని, దీనిపై కూడా విచారణ జరిపిస్తున్నామన్నారు. క్షణికావేశంలో తప్పు చేసిన వ్యక్తిని చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని చెట్టుకు కట్టివేసి గాయపరిచినందుకు ముద్దాయిలు తగిన మూల్యం చెల్లించికుంటున్నారని, వారిపై బైండవర్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లను ఓపెన్ చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ ఆదేశాలతో స్పెషల్ పార్టీ బోట్ల గూడూరులో పోలీస్ కవాతు నిర్వహించి బాధితులకు అండగా మేము ఉంటామని తెలియజేసారు. ఎటువంటి చిన్నపాటి అలజడి ఘర్షణ జరిగిన అందుకు కారణమైన వారిపై తీసుకుబోయే చర్యలు మరొకరికి ఈ విధంగా చేయాలన్నా భయభ్రాంతులకు గురి చేసేవిధంగా ఉండాలన్నారు.













Leave a Reply