- వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుళ్ళ రామకృష్ణ గుడ్ విల్ విజిట్ 2025
- మాజేటి సత్యనారాయణ తన భార్య రమాదేవి జ్ఞాపకార్థం తొమ్మిది లక్షల విలువ గల కారు వితరణ
జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 20 : స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ బీటెక్ యూత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జగ్గంపేట వాసవి క్లబ్ అధ్యక్షుడు మానేపల్లి రామానుజ అధ్యక్షతన క్లబ్బు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుళ్ళ రామకృష్ణ గుడ్ విల్ విజిట్ 2025 కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
మరో ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్బు ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ మానేపల్లి బంగార్రాజు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షుడు కొత్త కొండబాబు హాజరయ్యారు. గుడ్ విల్ విజిట్ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలలో భాగంగా వికాస తరంగిణి కాకినాడ వారికి తొమ్మిది లక్షల విలువగల కారు వితరణ చేసిన మాజేటి సత్యనారాయణ వారి భార్య రామాదేవి జ్ఞాపకార్థం కారు అందించారు. బీపీ, షుగర్ వ్యాధి గుర్తింపు వైద్య శిబిరం నిర్వహించారు. ఎంబిబిఎస్ చదువుతున్న పేద విద్యార్థినికి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు. ఇంద్రపాలెంలో గల శ్రీ గోపాల గో సంరక్షణ సంఘంకు రూ.50 వేలు వితరణ, వాసవి మనో నేస్తం మనో దివ్యాంగం సహాయం కింద మానసిక దివ్యాంగులకు దుప్పట్లు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుళ్ళ రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా జగ్గంపేట వాసవి క్లబ్, వాసవి క్లబ్ వనిత క్లబ్ వాసవి బిటెక్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఐఇసి ఆఫీసర్ నాళం ఆండాళ్, క్యాబినెట్ సెక్రెటరీ మామిడిపాక సతీష్, క్యాబినెట్ ట్రెజరర్ కంచర్ల వెంకట సత్యనారాయణ, ఐపిసి బొండా వీర సత్యనారాయణమూర్తి, ఐపిసి గ్రంధి నాగబాబు, మతంశెట్టి నారాయణ, మతంశెట్టి లావణ్య, ఉద్దగిరి కామేష్, మానేపల్లి యామిని, బోండా అయ్యప్ప, నిట్టల శ్రీనివాస్, నిట్టల నాగలక్ష్మి, మతంశెట్టి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply