Advertisement

జగ్గంపేట కోనేటి వద్ద నూకాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 10 : జగ్గంపేట స్థానిక కోనేటి వద్ద నూకాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీను మణిబాబు ముఖ్య అతిథులుగా హాజరై ఆలయ నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేసి, శంకుస్థాపన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు, జగ్గంపేట ఆత్మ కమిటీ డైరెక్టర్ వైభోగుల కొండబాబు యాదవ్, జగ్గంపేట శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షుడు మొరుకుర్తి రాజు మాట్లాడుతూ జగ్గంపేట గ్రామ పెద్దలు, ప్రజలు సహకారంతో కోనేటి వద్ద కోరిన కోర్కెలు సిద్ధించే అమ్మవారు నూకాల అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి సోమవారం ముహూర్తం ఖరారు చేయడంతో గ్రామ పెద్దలు చేతుల మీదుగా భూమి పూజ చేసి శంకుస్థాపన నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ తెలుగు యువత అధ్యక్షుడు దేవరపల్లి మూర్తి, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, టౌన్ టిడిపి అధ్యక్షుడు పాండ్రంగి రాంబాబు, బీసీ నేత పీలా మహేష్, మాజీ యాదవ సంఘం అధ్యక్షుడు వైభోగల శ్రీనివాస్ యాదవ్, నల మాటి ఆనంద్, వెలిశెట్టి బుజ్జి, కోడూరి రమేష్, బాలు రెడ్డి, పురంశెట్టి వీరబాబు, చేలికాని హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *