Advertisement

జాతీయ పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

-వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు

-ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మాచవరం గౌరీ శంకర్

మంచిర్యాల సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 – తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని భారత గౌరవ సన్మాన పురస్కార్ పేరిట జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మాచవరం గౌరీశంకర్ గురువారం ప్రకటనలో తెలిపారు. సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషిచేసిన వారికి జాతీయ స్థాయిలో భారత గౌరవ సమ్మాన్ పురస్కారంతో పాటు గ్లోబుల్ ఎక్స్లెన్సీ పురస్కారం, ఐకానిక్ అవార్డు, లెజెండరీ పురస్కారాలతో సత్కరించి, వారి సేవలను అభినందిస్తూ, వారిని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. వాస్తు, జ్యోతిష్యం, విద్య, నాలెడ్జ్, కల్చరల్, సామాజిక సేవ, లీడర్స్, స్పెషల్ టాలెంట్ తదితర వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు ఈ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 25, 2025 తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు.

దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని భాయ్ వీర్ సింగ్ మార్క్, సెక్టార్ 2 గోలే మార్కెట్ లో గల యూనిట్ ఆఫ్ రాష్ట్రీయ ఏక్తా సమితిలో భాగమైన నెంబర్ 7 లోని ఎన్ఎం సెంటర్ లో డిసెంబర్ 07, 2025న నిర్వహించు కార్యక్రమంలో వారిని జాతీయ స్థాయి పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు.

మరిన్ని వివరాలకు 9985275385, 7382592852 సెల్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *