కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్ ఎస్.ఆర్. ఎం.టి ఫంక్షన్ హాల్లో మూడు రోజులపాటు జరగనున్న ‘జె-కాం బిజినెస్ ఎక్స్పో’ ను కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ (టీ టైం ఉదయ్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. పరిశ్రమలు, టెక్నాలజీ, ఫుడ్ ప్రోడక్ట్స్, స్టార్టప్‌లు, హ్యాండీక్రాఫ్ట్స్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు వంటి విభాగాలకు చెందిన వ్యాపార సంస్థలు మరియు పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ వ్యాపార కేంద్రంగా, పారిశ్రామిక అభివృద్ధి హబ్‌గా ఎదగడానికి ఇలాంటి ఎక్స్‌పోలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. చిన్నతరహా వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకురావడానికి, కొత్త అవకాశాలను కనుగొనడానికి ఇది మంచి వేదిక అన్నారు. అలాగే ఆయన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకంగా మాట్లాడతూ స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా ప్రభుత్వం, అలాగే తాము ప్రజాప్రతినిధులుగా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామన్నారు. కాకినాడ ప్రజలకు ఇలాంటి బిజినెస్ ఎక్స్‌పోలు ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగావకాశాల పెరుగుదలకు దోహదం చేస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె-కాం సంస్థ నిర్వాహకులు, స్థానిక వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జె-కాం బిజినెస్ ఎక్స్పోను ప్రారంభించిన ఎంపీ ఉదయ్
















Leave a Reply