- కార్తీక మాసం చివరి సోమవారం వృద్ధాశ్రమంలో సామూహిక వనభోజనం
తుని, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : కాకినాడ జిల్లా తునిలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళ శ్రావణి సాయి వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణ వృద్ధాశ్రమంలోని సుమారు 100 మంది వృద్ధులతో కలిసి సామూహిక వనభోజనాలను ఏర్పాటు చేశారు. వృద్ధులతో భోజనం చేసి, స్వయంగా వడ్డిస్తూ వారిని సంతోషపరిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, జనసేన పార్టీ తుని నియోజకవర్గం సమన్వయకర్త చోడిశెట్టి గణేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. జనసేన పిఠాపురం మహిళా నాయకురాలు బొలిశెట్టి వెంకటలక్ష్మి, జనసేన పార్టీ తొండంగి మండలం అధ్యక్షుడు బెండపూడి నాయుడు, తుని పట్టణ జనసేన నాయకులు కోడూరు సురేష్, గోవింద్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నేతలకు, వృద్ధులకు శ్రావణి సాయి స్వయంగా తయారు చేసిన భోజనాలను వడ్డించారు. ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ కుటుంబాలతో కార్తీక కార్యక్రమాలు చేసుకునే ఈ కాలంలో, వృద్ధాశ్రమంలో ఉన్న వారికి ఎన్నో రకాల పిండి వంటలతో శ్రావణి సాయి అన్నదానం చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేసి న శ్రావణిసాయి ఈ రోజు వృద్ధులతో కలిసి వనభోజనం చేయడం ముదావహమని నాయకులు అభినందించారు. తునిలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం వృద్ధులకు ఆనందాన్ని – సేవా భావానికి మరింత విలువను తీసుకొచ్చిందని ఆమెను కొనియాడారు.
















Leave a Reply