Advertisement

దళిత, బహుజన, గిరిజనుల ఐక్య పోరాటంతోనే మోదీకి బుద్ధిచేపుదాం

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు
  • సామాజిక న్యాయం, ఆత్మ గౌరవ కై సీపీఐ నిరసన ప్రదర్శన

రాజమండ్రి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : దళిత, బహుజన, గిరిజనులందరూ మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాటం చేయాలని అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజిక న్యాయం ఆత్మగౌరవం జనగణనలో కుల గణన చేపట్టాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ సిపిఐ జాతియ సమితి పిలుపుమేరకు జనగణలో కులగనన చేపట్టాలని, సామాజిక న్యాయం ఆత్మగౌరవం తదితర అంశాలపై ఈ దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రంలోకి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి గత 11 ఏళ్ళ కాలంలో దళిత, గిరిజన, మైనార్టీ, వర్గాలపై దాడులు మితిమీరి పోయాయని మధు అన్నారు. దేశంలో మతోన్మాద పాలన సాగుతుందన్నారు.

అణిచివేత అంటరానితనం కుల మత వివక్షత హింస పేట్రేగిపోతుందని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ కనుసన్నలలో భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన కొనసాగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగం మానవ హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం, సౌబ్రా తత్వన్ని మోదీ ప్రభుత్వం పాతర వేసిందని ఆయన అన్నారు.

మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయని, గత స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని మధు అన్నారు. తెలంగాణలో ప్రభుత్వం జనాభ లెక్క సందర్భంగా కులగణను చేపట్టి అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించిందని మధు అన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జనగణలో కులగణను చేపట్టి కులాల ప్రతిపాదన బీసీలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని మధు కోరారు. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య హక్కులను హరించే దుష్టశక్తులను తిప్పికొట్టేందుకు దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనార్టీలు ఐక్యమై పోరాటానికి సిద్ధం కావాలని మధు పిలుపు నిచ్చారు.

అనంతరం రాజమoడ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కె.రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సహాయ కార్యదర్శి పి.లావణ్య, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.త్రిమూర్తులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సునీల్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పి.కొండావతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, జట్ల సంఘం అధికార బాడి నల్ల రామారావు, దేవుడు బాబు, కాళ్ళ అప్పలనాయుడు, రెడ్డి వెంకట్రావు, పార్టీ నగర కార్యవర్గ సభ్యుడు టి.నాగేశ్వరరావు, పార్టీ జిల్లా సమితి సభ్యురాలు కాకి శారద పోలమ్మ తదితరులు నాయకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *