ఉండ్రాజవరం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తుడు బకిం చంద్ర ఛటర్జీ రచించిన “వందేమాతరం” గేయం స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిందని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ వివరించారు. బకిం చంద్ర ఛటర్జీ “వందేమాతరం” గేయం రచించి నూట ఏభై సంవత్సరాలు నిండిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యావత్ భారత దేశంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం పది గంటలకు పాలంగి గ్రామ సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా కోట రామప్రసాద్ పాల్గొని వందేమాతరం గేయం యొక్క ప్రాముఖ్యత వివరించారు. అనంతరం గ్రామ సచివాలయం కార్యదర్శి మహమ్మద్ హసన్ జానీ, స్థానిక రెండవ నెంబర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, గ్రామ సచివాలయం సిబ్బంది, ఆరోగ్య ఉపకేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు, పుర ప్రజలు అందరూ కలిసి వందేమాతరం గేయం ఆలపించారు.
పాలంగి గ్రామ సచివాలయం లో ఘనంగా వందేమాతరం గేయం ఆలాపన
















Leave a Reply