- ఏకదంత — ప్రాచీన భారత విద్యాలయానికి ‘కల్చరల్ ప్రిజర్వేషన్ & నోలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 20 : ప్రచారం మీడియా నిర్వహిస్తున్న “స్త్రీ శక్తి ప్రతిభ అవార్డులు–2025” కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 70 మంది విశిష్ట మహిళలు మరియు సాంస్కృతిక సంస్థలకు అవార్డులు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భాగంగా ఏకదంత – ది స్కూల్ ఆఫ్ ఏన్షెంట్ ఇండియన్ స్టడీస్ సంస్థను ‘కల్చరల్ ప్రిజర్వేషన్ & నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డు’ కోసం ఎంపిక చేశారు. ప్రాచీన భారతీయ జ్ఞానం, సంస్కృతి, వేదాంత బోధనా సంప్రదాయాలను ఆధునిక తరానికి చేరవేస్తూ, వేలాది మంది విద్యార్థులకు సంస్కృతం, గీతా మరియు ప్రాచీన భారత విద్యలను బోధిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు అందజేయబడుతోంది.
ఈ కార్యక్రమం డిసెంబర్ 22–23, 2025 తేదీల్లో మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో జరుగనుంది. అవార్డు గ్రహీతగా ఆచార్య సీ.హెచ్ సద్గుణ హాజరవనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏకదంత సంస్థలో 1500 మంది గీతా విద్యార్థులు, 3000 మంది వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. భారతీయ పరంపరల సంరక్షణలో ఈ సంస్థ చేస్తున్న సేవను ప్రచారం మీడియా ప్రత్యేకంగా అభినందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో నిర్వాహకులు ప్రకటించనున్నారు.
















Leave a Reply