తాళ్ళరేవు , సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : సుమారు 36 లక్షల ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ 47 మంది లబ్ధిదారులకు మేలు చేకూరింది. ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ఈరోజు మురమళ్ళలోని శాసనసభ సభ్యులు కార్యాలయంలో ముమ్మిడివరం, తాళ్లరేవు ఐపోలవరం, కాట్రేనికోన, మండలాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి (ఏపిసిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.36 లక్షల ఆర్థిక సహాయ చెక్కులను ప్రభుత్వ విప్ & ముమ్మిడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య ఖర్చులు విషయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు సీఎం సహాయ నిధి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాల్లో తోడుగా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చే ఆర్థిక సహాయం ఒక్క కుటుంబానికి కాదు భవిష్యత్తుకు ఆసరాగా నిలుస్తుంది అని, పేదల వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ ఎఫ్ నిధి నుండి చెల్లించడం జరుగుతుందని, ఇది పేదల విషయంలో ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కు నిదర్శనం అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కూటమినేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
















Leave a Reply