Advertisement

ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేయాలి

  • మురాల శెట్టి సునీల్ కుమార్, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, ఫిబ్రవరి 02: పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మరింత కృషి చేయాలని గోదావరి ఈ స్ట్రన్ డెల్టా చైర్మన్ మురాల శెట్టి సునీల్ కుమార్, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ కోరారు. పిఠాపురం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నుకోబడిన డాక్టర్ వరలక్ష్మి ని ఇరువురు నాయకులు ఆమె కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వరలక్ష్మి రమణరావు దంపతులను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ప్రజాసేవ పరమావధిగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి సత్యనారాయణ (బూరయ్య కాపు) సి.హెచ్.శేషగిరి, సూరవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *