- వీరాంజనేయ స్వామి వారి 59వ వార్షికోత్సవం,
- పంచాయన సహిత విశ్వనాథ స్వామి లింగ పునర్ప్రతిష్ఠ 24వ వార్షికోత్సవం,
- ఆలయ సముదాయంలోని ఇతర విగ్రహాల 24వ వార్షికోత్సవ కుంభాభిషేకాలు
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవాలు కార్తీక బహుళ నవమి నుండి ఏకాదశి వరకు (13–15 నవంబర్ 2025) భక్తుల కోలాహలంతో, వేదఘోషాలతో విజయవంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా దేవస్థానంలోని అనేక వార్షికోత్సవాలు కూడి నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా— – వీరాంజనేయ స్వామి వారి 59వ వార్షికోత్సవం, – పంచాయన సహిత విశ్వనాథ స్వామి లింగ పునర్ప్రతిష్ఠ 24వ వార్షికోత్సవం, – ఆలయ సముదాయంలోని ఇతర విగ్రహాల 24వ వార్షికోత్సవ కుంభాభిషేకాలు వైభవోపేతంగా పూర్తయ్యాయి.

ముగిసిన మూడు రోజుల కార్యక్రమాల సంక్షిప్త వివరాలు తొలి రోజు
– కార్తీక బహుళ నవమి (13-11-2025) ఉదయం సుప్రభాతం, మంగళవాయిద్యంతో ప్రారంభమైన కార్యక్రమాలు గణపతి పూజ, సంస్కార క్రతువులు, అగ్ని ప్రతిష్ఠ, ప్రతిష్ఠా మూర్తుల జలాధివాసం వంటి సంప్రదాయ కర్మకాండలతో సాగాయి. సాయంత్రం మూలమంత్ర హోమం, ప్రదోష పూజతో రోజు ముగిసింది.
రెండో రోజు – కార్తీక బహుళ దశమి (14-11-2025) మండప దేవతా ఆరాధనలు, వివిధ హోమాలు, స్నపన క్రియలు, ధాన్యాధివాసం నిర్వహించబడ్డాయి. సాయంత్రం ఫల–పుష్ప శయ్యాధివాసంతో కార్యక్రమాలు ముగిశాయి.
మూడో రోజు – కార్తీక బహుళ ఏకాదశి (15-11-2025) అభిషేకాలు, గర్భసంస్కార క్రతువులు పూర్తయ్యాయి. ఉదయం 10:02 గంటలకు యంత్ర ప్రతిష్ఠ, 10:21 గంటలకు శ్రీ విశ్వనాథ స్వామి శివలింగ పునర్ప్రతిష్ఠ, తరువాత పూర్ణాహుతి, మధ్యాహ్నం మహా కలశ సంప్రోక్షణ ఘనంగా నిర్వహించబడ్డాయి. సాయంత్రం ఉత్సవమూర్తుల శాంతి కల్యాణంతో మహోత్సవాలు ముగిశాయి. స్వామి సాక్షాత్కృతానంద ఆశీర్వచనం మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ సాక్షాత్కృతానంద స్వామి (హృష్టీకేశ్ అర్ష పీఠాధీశ్వరం, పరమపూజ్య స్వామి దయానంద సరస్వతి శిష్యుడు) వారి చేతుల మీదుగా: శివలింగ పునర్ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, ఆలయ గోపురాల కలశాలతో కుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత స్వామీజీ భక్తులకు, ముఖ్యంగా చిన్నారులకు, ధార్మిక క్రమశిక్షణ, సంస్కృత విద్య, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణపై అనుగ్రహ భాషణం అందించారు.














Leave a Reply