– మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన బాధితులందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట పట్టణంలోని 4వ వార్డులో శ్రీ సూర్య చంద్ర ఫిషర్ మెన్స్ సొసైటీ శ్రీ రామాలయం వద్ద తుఫాన్ లో ఉపాధి కోల్పోయిన మత్స్య కారులకు ప్రభుత్వ సాయం ఆయన పంపిణీ చేశారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి 50 కేజీల బియ్యంతో పాటుగా కందిపప్పు, నూనె, చక్కెర, బంగాళాదుంపలు, వంటి నిత్యావసరాలను పంపిణీ చేశారు. పట్టణంలో మొత్తం 196 మంది కుటుంబాలకు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎస్ విద్యా సంస్థ కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు, 4వ వార్డు కౌన్సిలర్ గుండు రామ తులసి, టిడిపి నాయకులు గుండు తాతరాజు, కాటా గోపి తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply