– హైదరాబాద్‌లో ‘ ఏకదంత ’ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం
హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 06 : సంస్కృత భాషా మహిమాన్వితాన్ని పునరుద్ధరించేందుకు, ‘ఏకదంత – ది స్కూల్ ఆఫ్ యాన్షెంట్ స్టడీస్’ సంస్థ జాతీయ స్థాయిలో “భగవద్గీతా శ్లోకాల పోటీ – 2025”ను ప్రారంభించింది.
గీతాజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంస్కృత శ్లోకాల పఠనాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా సంస్థ ప్రధాన ఆచార్య చింతకింది సద్గుణా మాట్లాడుతూ సంస్కృత శబ్దం ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటుంది. గీతా శ్లోకాల పఠనంతో భాషా సౌందర్యం మాత్రమే కాక, అంతరాత్మ శాంతిని కూడా పొందవచ్చు. ప్రతి భారతీయుడు కనీసం కొన్ని గీతా శ్లోకాలు నేర్చుకోవాలని ఈ పోటీ ద్వారా మేము ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు.
పోటీ విభాగాలు :
దేశవ్యాప్తంగా పాల్గొనదగిన ఈ పోటీలో మూడు విభాగాలుగా ఉంటుంది.
జూనియర్స్ (15 సంవత్సరాల లోపు) :
2 సంస్కృత శ్లోకాలు — వాటిలో ఒకటి తప్పనిసరిగా భగవద్గీతా శ్లోకం ఉండాలి.
యువత (16–30 సంవత్సరాలు) :
3 శ్లోకాలు — రెండూ గీతా శ్లోకాలు తప్పనిసరి.
వయోజనులు (30 సంవత్సరాలు పైబడిన వారు) :
5 శ్లోకాలు — మూడు గీతా శ్లోకాలు తప్పనిసరి.
పాల్గొనేవారు తమ శ్లోకాల అర్థం లేదా సందేశాన్ని సంస్కృతం, ఆంగ్లం లేదా స్థానిక భాషలో సంక్షిప్తంగా వివరించాలి. వీడియో నాణ్యత HD (1920×1080)లో ఉండాలి. ధ్వని స్పష్టంగా, వెలుతురు సరిపడుగా ఉండాలి. పాల్గొనేవారు సాంప్రదాయ భారతీయ దుస్తులు ధరించి, తిలకం / భస్మం / కుంకుమ ధరించడం ద్వారా భక్తి సూచన చూపాలి. నేపథ్యం శుభ్రంగా, భక్తి వాతావరణం కలిగిన స్థలంలో (దేవాలయము, పాఠశాల, సాదా గోడ మొదలైనవి) ఉండాలి. వీడియో వ్యవధి విభాగం ఆధారంగా 1 నుండి 5 నిమిషాల మధ్యలో ఉండాలి.
– తీర్పు కమిటీ సభ్యులు

ఈ పోటీకి దేశవ్యాప్తంగా పేరుగాంచిన సంస్కృత పండితులు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
త్రివిక్రమానంద స్వామిజీ, హైదరాబాద్ — వేద, ఉపనిషత్, గీతా బోధకుడు. అనేక శిష్యులకు గీతా పఠన శిక్షణ అందించారు.
టి.విశ్వేశ్వర గారు, గీతా ఆచార్య, గీతా పారాయణ వైభవ శిరోమణి — గీతా పారాయణ సంప్రదాయ ప్రచారంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి.
డాక్టర్ రాహుల్ మైటి, (B.A., M.A. (Gold Medalist), M.Phil., NET, JRF, Ph.D. in Sanskrit) — ఆధునిక పద్ధతిలో గీతా బోధన, సంస్కృత పరిశోధనలో కీలక పాత్ర.
– బహుమతులు :
శ్లోకాల ఉచ్చారణ, భక్తి భావం, ప్రదర్శన, అర్థవివరణ వంటి అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. ప్రతి విభాగంలో జాతీయ స్థాయి విజేతలకు ఏకదంత కిట్ సర్టిఫికెట్ అవార్డులు ఇవ్వబడతాయి. ఎంపికైన వీడియోలు ఏకదంత యూట్యూబ్ చానెల్‌లో ప్రసారం చేయబడతాయి.
వీడియో సమర్పణ & వివరాలు
పోటీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం
సంప్రదించండి: 9989612512

















Leave a Reply