మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 10 : మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ అన్నారు. మండపేట డొక్కా సీతమ్మ స్వశక్తి భవనంలో సోమవారం సఖి సురక్షా వైద్య శిబిరం ను ఆయన ప్రారంభించారు. 30 సంవత్సరాలు దాటిన డ్వాక్రా మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ కమీషనర్ టీ.వీ.రంగారావు, మెప్మా పిడి పెంచలయ్యలతో కలిసి ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో పలు రక్తపరీక్షలతో పాటు కేన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేస్తారన్నారు. ఎటువంటి లక్షణాలు లేకపోయినా మహిళలు కేన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ముందస్తు పరీక్షలు చేసుకోవడం ద్వారా భవిష్యత్ లో ఎదురయ్యే పెను నష్టాన్ని తప్పించుకోవాలన్నారు. ప్రతి మహిళా విధిగా కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మున్సిపల్ కమీషనర్ టీవీ రంగారావు మాట్లాడుతూ 30 సంవత్సరాలు దాటిన డ్వాక్రా మహిళలు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడే పలు వైద్య పరీక్షలతో పాటు ఆయుస్మాన్ భారత్ కార్డులను కూడా ఇక్కడే ముద్రించి ఇస్తారన్నారు. పట్టణంలోని అన్ని వార్డులు నుండి మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం వరకు శిబిరం నిర్వహిస్తారని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ పి.సుజాత తెలిపారు. సాయంత్రంలోపు పట్టణంలోని అన్ని వార్డులు నుండి మహిళలు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వరాజ్య లక్ష్మీ, సిరంగు ఈశ్వరరావు, మేడింటి సూర్య ప్రకాష్, శెట్టి రవి, గణిశెట్టి బాబి, మెప్మా ఐబీ కే.మోహన్ కుమార్, సఖి సురక్షా టీమ్ కో ఆర్డినేటర్ డాక్టర్ వశిష్ట, మెప్మా సీవోలు, ఆర్పిలు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి
















Leave a Reply