కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 20 : గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు ముత్యాల సత్యనారాయణ తల్లి ముత్యాల సరస్వతి ఇటీవల మరణించారు. విషయం తెలిసిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, గండేపల్లి మండల టిడిపి అధ్యక్షుడు పోతుల మోహన్ రావు గురువారం యర్రంపాలెం గ్రామంలోని ముత్యాల సత్యనారాయణని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పూతల మోహన్రావు, సర్పంచ్ ముత్యాల దుర్గారావు, ముత్యాల భాస్కరరావు, బిక్కిన వెంకటరమణ, బిక్కిన వీరభద్రరావు, ముత్యాల రాంబాబు, ముత్యాల వీరభద్రరావు, ముత్యాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముత్యాల సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు













Leave a Reply