యు.కొత్తపల్లి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వంగా గీతా విశ్వనాధ్ ఆదేశాల మేరకు ఉప్పాడ కొత్తపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వాకతిప్ప గ్రామంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధనీడి సుజాత పాల్గొని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు గ్రామస్థాయి నుండి పోరాటం చేసే విధంగా మహిళలను చైతన్యవంతులను చేస్తామని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే మెడికల్ విద్యను ప్రైవేటు పరువు చేయడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నల్ల కుళ్ళిపోయిన మెడికల్ కాలేజీలను ఏ స్వార్థంతో ప్రైవేట్ పరం చేస్తున్నారు. అనే విషయం ప్రజలకు తెలియాలని సుజాత ఈ సంతకాల సేకరణలో భాగముగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ్యోతుల వాణి, ఆలపు సుధారాణి, రాసంశెట్టి భవాని, వడ్డీ నాగమణి, అనిశెట్టి సుభాషిని, నరకుర్తి వెంకటలక్ష్మి, పల్లా బేబీ రాణి, జిగటాల లక్ష్మీకాంతం, బత్తిన రాణి, మండల పార్టీ అధ్యక్షులు ఆనాల సుదర్శన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు రావు చిన్నారావు, గోపి హరిబాబు, మేక నాని, సాకా చిన్నబ్బాయి, బోడపాటి రాజేష్, కాళ్ల గోవిందు, పులపకూర లావణ్య, ఎద్దు అప్పలరాజు, సికోలు సత్తిబాబు, పల్లా రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరణ













Leave a Reply