హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 04 : నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సినీ నటి రేణుదేశాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని సినీ దర్శకుడు సాయికిరణ్ అడివి అన్నారు. తాను నూతనంగా నిర్మించబోయే పదహారు రోజుల పండుగ చిత్రంలో రాజమ్మ పాత్రలో రేణుదేశాయ్ నటించనున్నట్లు తెలియజేశారు. ప్రాథా పిక్చర్స్, సాయి సినీ చిత్ర సంయుక్త బ్యానర్లపై సురేష్ కుమార్ దేవత, హరితా దుద్దుకూరు, ప్రతిభా అడివి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిర్మాత, నటుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు తనయుడు సాయి కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. పదహారు రోజుల పండుగ చిత్ర బృందం తరపున రాజమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజమ్మకు జన్మదిన శుభాకాంక్షలు – దర్శకుడు సాయికిరణ్ అడివి
















Leave a Reply