Advertisement

రావులపాలెం అరటి మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి

  • రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణం,షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, వే బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తాం
  • కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

రావులపాలెం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఆకుల రామకృష్ణ మార్కెట్ యార్డును పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్ యార్డుకు ఉత్తరం వైపున ఏఎంసి ఆధ్వర్యంలో సిసి రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. మార్కెట్ యార్డ్ బయట రావులపాలెం వెదిరేశ్వరం కాలువవైపు డ్రైనేజీ నిర్మాణం చేపడతామన్నారు. నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామన్నారు. వే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడతామని తెలిపారు. ఆయా పనులకు సంబంధించి త్వరలోనే ప్రతిపాదనలు రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారుకు రైతులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *