మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : పవిత్ర కార్తీక మాసంలో గోపూజ చేయడం శుభప్రధమని మండపేట శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయ అర్చకులు బంటుమిల్లి చంద్రశేఖర్ అన్నారు. లలితా గ్రూపు ఆద్వర్యంలో టౌన్ హాల్ వద్ద గల కామాక్షి ఆలయం వద్ద ప్రతి ఏటా కార్తీకమాసం గోపూజ నిర్వహిస్తారు. ఈ నేపద్యంలో బిజెపి సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ, ఉషాకుమారి దంపతులు బుధవారం పూజలు నిర్వహించారు. శ్రీమతులైన గోమాతలు, కామధేను సంతానమై, బ్రహ్మపుత్రకులైన పవిత్ర గోమాతలను పూజిస్తే దోషాలు పోతాయని అన్నారు. గోమాతను స్మరణవల్ల సంపూర్ణ పాపవిముక్తి కలుగుతుందని చెప్పారు. వాటికి ఆహారం అందిస్తే సకలదోషాలు పోతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోమాతను అధికసంఖ్యలో మహిళలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల సుభద్ర, మంగిపూడి లక్ష్మి, గొల్తిలక్ష్మి, యశోద, గౌరి, మాధవి, మౌనిక, చిట్టిమణి, ప్రసన్నకుమారి, పెంకే కళ, జక్కా నాగమణి, గాడు వరలక్ష్మి అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
లలితాగ్రూపు ఆద్వర్యంలో గోమాతకు పూజలు















Leave a Reply