– అందజేసిన టీమ్ నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు
రావులపాలెం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : రావులపాలెం గ్రామానికి చెందిన లింగోలు సత్యవతి క్యాన్సర్ కారణంగా బాధపడుతు, ఆర్థికంగా చాలా ఇబ్బందులుపడుతున్నారని తెలిసి టీమ్ నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ దృష్టికి రావడంతో సంస్థ వ్యవస్థాపకుడు అంబటి కిషోర్ ఆధ్వర్యంలో సహాయానిధిని ఏర్పాటు చేసి విరాళాలు ద్వారా వచ్చిన రూ.15వేలను ఆదివారం నాడు సత్యవతి ఇంటికి వెళ్లి వైద్యసహాయం నిమిత్తం సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ సభ్యులు విక్టరీ బద్రి, అవినాష్ చౌదరి టీమ్ నేను సైతం ఆడపడుచులు కొవ్వూరి రేణుక రెడ్డి, కంఠంశెట్టి దేవి శ్రీనివాస్, ఆకుల జ్యోతి పాల్గొన్నారు.
















Leave a Reply