– రూ.1.16 కోట్లతో నిర్మించనున్న టెన్జెల్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
– ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా శరవేగంగా వాడపల్లి అభివృద్ధి
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని వైజాగ్ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. బుధవారం ఆయన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడుతో కలిసి వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే బండారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వారికి వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం వద్ద రూ.1.16 కోట్లతో నిర్మించనున్న టెన్జెల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ వాడపల్లి ఆలయం గతంలో కన్నా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో రూ.96కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. వాడపల్లి చారిత్రక నాటి ఆలయంగా కనిపిస్తుందని, స్థానిక నాయకుల కృషితో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. గతంలో ఒకే క్యూలైనుకు అవకాశం ఉన్న ద్వారాలను వెడల్పు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో 3వ స్థానంలో ఏపీ ఉందని, ఎక్కువగా ఆధ్యాత్మిక పర్యాటకానికి మన రాష్ట్రానికి పర్యాటకులు వస్తున్నారన్నారు. తిరుమల, సింహాచలం, విజయవాడ మొదలైన దేవాలయాలతో పాటు వాడపల్లి కూడా ఆ స్థాయిలో అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో ప్రభుత్వం ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













Leave a Reply