కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) సేవ చేస్తున్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) మానవసేవే మాధవసేవగా భావించి గత 40 సంవత్సరాలుగా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాకినాడ 26వ డివిజన్ కు చెందిన శివరాత్రి రాజి పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్ హఠాత్ మరణం చెందడంతో వారి కుటుంబానికి చెదోడుగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిలబడి ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి శివరాత్రి ధన శేఖర్ విద్యకు అవసరమైన ఒక్క సంవత్సరానికి సరిపడా ఫీజు చెల్లించేందుకు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) రూ.25 వేలు చెక్కు ని విద్యార్థి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగన్నాపురం మండలం ఇంచార్జ్ కోక్కిలి గడ్డ గంగరాజు పాల్గొన్నారు.
విద్యార్థి శివరాత్రి ధన శేఖర్ చదువుకు ఆర్థిక సాయం అందించిన ఎంజిఆర్
















Leave a Reply