Advertisement

విశాఖపట్నంలో రహేజా ఐటీ స్పేస్, లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు

విశాఖపట్నం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో విశాఖ రియల్ఎస్టేట్ రంగానికి మరో దిగ్గజం తనదైన ముద్ర వేయనుంది. విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్స్‌లో కె రహేజా కార్ప్ సంస్థ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. రూ.2,172 కోట్ల పెట్టుబడితో 27.1 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ మిక్స్డ్- యూజ్ ప్రాజెక్ట్ విశాఖను దేశంలోని తదుపరి పెద్ద టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 28.65 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్‌లు, ప్రీమియం లగ్జరీ రెసిడెన్షియల్ యూనిట్లు, ప్రపంచస్థాయి సౌకర్యాలతో రూపొందిస్తారు. మధురవాడ ఐటీ ఎస్ఈజెడ్ హిల్ నెంబర్-3లో 15.51 ఎకరాలు కమర్షియల్ స్పేస్‌కు, మిగిలిన 11.59 ఎకరాలు రెసిడెన్షియల్‌కు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ గూగుల్ ఏఐ హబ్, టిసిఎస్, కాగ్నిజెంట్, అక్సెంచర్ వంటి ఐటీ జెయింట్లు విశాఖలో పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడానికి రూపొందించారు. విశాఖలో నాలుగు మేజర్ ఐటీ కంపెనీలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. డబ్ల్యూటిసి 7.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో యెండాడలో నిర్మిస్తున్నారు ఈ అన్ని ప్రాజెక్టులు విశాఖను భారతదేశంలోని తదుపరి ఐటీ హబ్‌గా మార్చడంలో కీలకమైనవి. విశాఖ రియల్ ఎస్టేట్ రంగం మరిన్ని దిగ్గజ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *