Advertisement

వైభవంగా శ్రీ సత్యదేవుని తిరుచ్చి సేవ

అన్నవరం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 13 : కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రము అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో శ్రీ సత్యదేవుని ప్రాకార సేవ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వివిధ రకముల సుగంధభరితమైన పుష్పములతో అలంకరించి తిరుచ్చి వాహనంపై ఆశీనులు గావించి వేదపండితుల మంత్రోచ్ఛరణ, మంగళ, వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహనాధికారి వేండ్ర త్రినాథరావు మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఆలయ ప్రధాన అర్చకులు, వ్రత పురోహితులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *