మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 11 : మండపేట వైసిపి టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ గా పట్టణానికి చెందిన వీరి కిరణ్ కుమార్ గౌడ్ ను పార్టీ నియమించింది. కిరణ్ కుమార్ గౌడ్ వైసిపి ఆవిర్భవం నుండి ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా ఉన్నారు. గత వైసీపీ హయాంలో రేషన్ వాహనాల ఆపరేటర్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా వైసిపి అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆశీస్సులతో తనను ఈ పదవిలో నియమించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
వైసీపీ టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ గా కిరణ్ కుమార్ గౌడ
















Leave a Reply