Advertisement

శభాష్ త‌మ్ముడూ… మంత్రి కొండా సురేఖ

  • నూతన ఎంఎల్ఏగా ఎన్నికైన న‌వీన్ యాద‌వ్ కు మంత్రి శుభాకాంక్ష‌లు
  • రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మ‌ర్యాద‌పూర్వంగా క‌ల‌సిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే న‌వీన్ యాద‌వ్‌

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 22 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవల ఘన మెజారిటీతో ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్ పేట్, వెంకటగిరి ప్రాంతాల్లో త‌న కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించి తనకి మంచి మెజారిటీ తీసుకువచ్చినందుకు మంత్రి సురేఖకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే, న‌వీన్ యాద‌వ్ ను ఘ‌నంగా స‌త్క‌రించిన మంత్రి సురేఖ ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఒక బీసీ బిడ్డ‌గా న‌వీన్ యాద‌వ్ గెలుపుతో తాను ఎంత‌గానో సంతోష‌ప‌డిన‌ట్టు సురేఖ ఆయనకు తెలిపారు. తనలాగే చిన్న వ‌య‌స్సులోనే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యార‌ని… మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని ఆమె అభిప్రాయపడ్డారు. అందుచేత‌, నవీన్ యాద‌వ్ ను గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి సేవ‌లు అందించాల‌ని ఆయనకు సూచ‌న చేశారు. అయితే, మంత్రి సురేఖ మంచి మాటలు, త‌న‌లో మ‌రింత స్ఫూర్తి నింపాయ‌ని న‌వీన్ యాద‌వ్ ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *