Advertisement

సత్తిబాబుకి అండగా పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ యూనియన్

పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 20 : యండపల్లి మండలం జోన్నలగరవులో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ సత్తిబాబు అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సత్తిబాబుకి అండగా పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ యూనియన్ నిలబడింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాయుడు శ్రీనుబాబు మాట్లాడుతూ తోటి జర్నలిస్ట్ అయిన సోదరుడు దడాల సత్తిబాబు ఆరోగ్యం బాలేనందువల్ల ఫీస్టులా సర్జరీ చేయవలసి వచ్చిందని, అందుచేత సోదరులందరూ కలిసి పిఠాపురం జర్నలిస్టు అసోసియేషన్ యూనియన్ తరపున రూ.5వేలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సహాకరించిన జర్నలిస్టు సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రాయుడు శ్రీనుబాబు, సెక్రటరీ చిన్ని, వైస్ ప్రెసిడెంట్ బళ్ళ సురేష్, టి.కామేశ్వరరావు(కరుణ్ రాజు), వై.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *