పిఠాపురం, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 08 : పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలంలో సహకార సంఘాల ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్ల సాధనకై కొత్తపల్లి సొసైటీ బ్యాంకు ఎదురుగా దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సొసైటీ యూనియన్ అధ్యక్షుడు గుండ్ర కామేశ్వరరావు మాట్లాడుతూ తమ సహకార సంఘాల ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తమకు జీవో విడుదల చేసింది అని కానీ ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లు జీవో 36 వెంటనే అమలు చేయాలి అని, 2019 – 2024వేతన సవరణ వెంటనే చేయాలి, గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలి అని, డ్యూటూలో పెట్టిన జీతాలను రద్దు చేయాలని, ఉద్యోగ రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాలకు పెంచాలి అని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని, సంఘాలకు చేరుదనంపై ఇవ్వవలసిన ఆరు శాతం డివిడెంట్ మరియు వడ్డీ చెల్లించాలని, సొసైటీ లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలి అని తదితర తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈఓలు అబ్బిరెడ్డి గోవిందరాయుడు, యాతం వీర వెంకట సత్యనారాయణ, అరవ రామమోహనరావు, కొర్ర రాజు, సొసైటీ సాదరబోయిన నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
సహకార సంఘాల ఉద్యోగుల డిమాండ్ల సాధనకై దీక్షలు













Leave a Reply