కాకినాడ/కిర్లంపూడి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం నేషనల్ హైవే మీద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి పరిశీలించారు. జీజీహెచ్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్న వైద్యులతో మరియి హాస్పిటల్ సూపండెంట్ తో మాట్లాడి, వారికి ఏ విధమైన లోటు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. గాయపడిన వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అలాగే ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. పరామర్శించిన వారిలో మత్స తిరుపతి రాయుడు, ఏనుగుపల్లి శ్రీను, అంకం ఓంకృష్ణ, స్వామి పిఎస్పికె, బీజేపీ రాంబాబు, కాయల మణికంఠ, పాలెం బాబీ తదితరులు పాల్గొన్నారు.
సోమవరం నేషనల్ హైవే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్ లో పరామర్శించిన తుమ్మలపల్లి రమేష్













Leave a Reply