– మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆర్టిఐ యాక్ట్ అధ్యక్షుడు, 8వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవికుమార్
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు మరియు సబార్డినేటర్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ & వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండపేట నియోజకవర్గం ఇంచార్జ్ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో మండపేట మున్సిపాలిటీ రెండో సచివాలయం పరిధిలో 7 మరియు 8 వార్డుల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆర్టిఐ యాక్ట్ అధ్యక్షుడు మరియు 8వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవికుమర్, 7వ వార్డు వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్ కొడమంచిలి భాస్కరరావు, ప్రజల వద్ద నుండి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. వార్డులో కూటమి ప్రభుత్వం పరిపాలనకి పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు. త్వరలో రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారని రవి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ప్రజలు నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజల తీర్పు ఉంటుందని మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఆర్టిఐ యాక్ట్ అధ్యక్షుడు, 8వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవికుమర్ అన్నారు.













Leave a Reply