తుళ్లూరు, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం పునఃనిర్మాణ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపిఎంఎస్ఐడిసి చైర్మన్ & జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని, వేదపండితులచే నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలను కనులార తిలకించారు. ఈ సందర్భంలో వేలాది భక్తులు ఆంజనేయ, హనుమంతా, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, జై శ్రీరామ్ అంటూ ఆలయ ప్రాంగణాన్ని మార్మోగిస్తూ భక్తి పరవశంతో పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి దివ్య ఆశీస్సులు, కృపాకటాక్షాలు రాయపూడి గ్రామ ప్రజలందరిపై నిత్యం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని చిల్లపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థాన పునఃనిర్మాణ ప్రతిష్ఠా మహోత్సవం











Leave a Reply