జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి నవంబర్ 01: జగ్గంపేట మండలం ఇర్రిపాక ఎమ్మెల్యే స్వగృహంలో గండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాకచర్ల బాబ్జి ఆధ్వర్యంలో నవంబర్ రెండవ తేదీ ఆదివారం నిర్వహిస్తున్న ఆర్యవైశ్య వనభోజనాలకు ఆహ్వానం పలికి, ఆర్యవైశ్య కమిటీ భవనానికి స్థలం కేటాయించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కృతజ్ఞతలు తెలియజేసారు. ఆదివారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కమ్యూనిటీ భవన శంకుస్థాపనకు నిర్వహించేందుకు ఎమ్మెల్యే నెహ్రూను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా గండేపల్లిలో ఆర్యవైశ్య కమ్యూనిటీ భవనం నిర్మించుకుందామని ప్రయత్నాలు చేస్తున్న తమకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో స్థలం కేటాయించి పంచాయతీ తీర్మానం చేసి నవంబర్ రెండో తేదీన ఆయన చేతి మీద శంకుస్థాపన చేసుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జల్లూరి ప్రదీప్, మామిడిపాక వెంకటరత్నం, వాకచర్ల బాబ్జి, వాకచర్ల నాగేశ్వరరావు, వాకచర్ల గోపి, మాతంశెట్టి రాము, సత్యవరపు బాబి, సత్యవరపు ప్రసాద్, ఎలమాటి కాశి, రెడ్డి సుబ్బారావు, ఇప్పర్ల బాబి తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ భవనం శంకుస్థాపనకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఆహ్వానించిన గండేపల్లి ఆర్యవైశ్య సంఘం
















Leave a Reply