పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా టిడిపి అధ్యక్షుడు జ్యోతుల నవీన్
జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : జగ్గంపేటలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షుడు, జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు జ్యోతుల నవీన్ పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ఎవరూ ఆర్థికంగా గానీ, సామాజికంగా గానీ వెనుకబడకూడదు అనే ఆలోచనతో అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిక్షణం ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, భూపాలపట్నం ప్రసాద్, కోండ్రోతు శ్రీను, తుమ్మల కిషోర్, బండారు నాని తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply