ఆడ బిడ్డల జోలికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నదే పవన్ కళ్యాణ్ సంకల్పం
- బాణాపురం ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి
- ఆ నిందితుడుకీ జనసేనకు సంబంధం లేదు… పార్టీ సభ్యత్వం కూడా లేదు
- జనసేన పార్టీ నేత, కొత్తపేట ఇంఛార్జి బండారు శ్రీనివాస్
- బాణాపురంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన జనసేన నేతలు
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : నేరం చేసినవాడికి కులం, మతం, పార్టీ ఉండవు. వాటి వెనక దాక్కుని ఉందామంటే చట్టం ఊరుకోదని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతారు. ఆడ బిడ్డల జోలికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నదే పవన్ కళ్యాణ్ సంకల్పం అని జనసేన పార్టీ నేత, కొత్తపేట ఇంఛార్జి బండారు శ్రీనివాస్ తెలియచేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామంలో మైనర్ బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి, వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం జనసేన నేతలు పరామర్శించారు. పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఓదార్చి ధైర్యం చెప్పాము. 11 ఏళ్ళ బాలికపై వికృత చేష్టలకు పాల్పడిన రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ (బాబీ)పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కఠిన శిక్ష విధించాలి. కొంత మంది పేటిఎం నాయకులు బాబి అనే వ్యక్తి జనసేన సభ్యుడని దుష్ప్రచారం చేస్తున్నారు. అతను 2019లో మాత్రమే పార్టీకి కొద్ది కాలం పని చేశారు. ఆ తరువాత నుంచి అతను జనసేనలో లేడు. క్రియాశీలక సభ్యత్వం కూడా లేదు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబి వైసిపి అభ్యర్థులకి ప్రచారం చేశాడు అనేది వాస్తవం అన్నారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళ ప్రాంతీయ కో-ఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి , ముమ్మడివరం మార్కెట్ కమిటి చైర్మన్ ఓగూరి భాగ్యశ్రీ, పార్టీ నేతలు జి.ఆర్.కె.బాలకృష్ణ (జమీ), వై.పురుషోత్తం, అత్తిలి బాబురావు, దూడల స్వామి తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply