– సిఎం చేతుల మీదగా అవార్డు అందుకున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
అమరావతి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 01 : మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకుంటూ, సహాయక చర్యల్లో ముందుండి సేవలందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన చేతుల మీదుగా ప్రశంసా అవార్డును ప్రదానం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బండారు సత్యానందరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు, పునరావాస చర్యల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజలతో నేరుగా మమేకమై, ప్రతి బాధితుడికి అండగా నిలిచిన ఆయన సేవలను సిఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ప్రజా సేవే నా ధ్యేయం. ఈ గుర్తింపు సిఎం ఇచ్చిన ప్రోత్సాహం మాత్రమే కాదని, ఇది తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తున్నదన్నారు. తుఫాన్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సేవలను ప్రభుత్వం భవిష్యత్తులో కూడా గుర్తించి ప్రోత్సహిస్తుందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
















Leave a Reply