అన్నవరం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 07 : కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నిర్వహణలో ఉన్న శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులు మరియు అధ్యాపకులచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు విద్యార్థులు మరియు అధ్యాపకులుచే వందేమాతర గేయాన్ని ముక్తకంఠంతో ఆలపించడం జరిగింది. తర్వాత కళాశాల ప్రిన్సిపల్ జి.వెంకట్ విద్యార్థులను ఉద్దేశించి వందేమాతర గేయం భారత జాతిని ఏ విధంగా మేలుకొల్పిందో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకులు మాట్లాడుతూ అక్టోబర్ 26న మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు వందేమాతరం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. అలాగే బకించందర్ చటర్జీ యొక్క నవల ఆనందమఠం గురించి వివరించడం జరిగింది. అలాగే జాతీయ ఉద్యమంలో వందేమాతరం యొక్క పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే వందేమాతరం 150 అనే వలయాకారమున ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల గణిత అధ్యాపకులు ఎం.కొండబాబు అలాగే ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. వారితో పాటుగా ఎన్ఎస్ఎస్ పిఓలు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాలలో ఘనంగా 150 వసంతాల వందేమాతరం
















Leave a Reply