మండపేట, సింహగర్జన ప్రతినిధి నవంబర్ 08 : మండపేట పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట పట్టణం ఆలమూరు రోడ్డు వైపు స్వాగత ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫౌంటైన్ పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ సుందరికరణ చర్యల్లో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులు రూ.18 లక్షలతో పనులు చేపట్టామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి.ఈ కింతాడ శ్రీనివాసు, ఏ.ఈ దాసరి పవన్ లు ఉన్నారు.
పట్టణ సుందరీకరకణకు ప్రాధాన్యత – చైర్ పర్సన్ రాణి
















Leave a Reply