జగ్గంపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో శనివారం ఉదయం కారు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలు పాలైన నలుగురు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ ఘటన స్థలానికి చేరుకుని సకాలంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు విషయం తెలియజేసిన వెంటనే చనిపోయిన కుటుంబాలకు మట్టి ఖర్చులు నిమిత్తం 25 వేల రూపాయలు తక్షణ సహాయంగా అందించాలని ఆదేశించడంతో జగ్గంపేట మార్చురీ వద్దకు చేరుకుని చనిపోయిన సోమవరం గ్రామానికి చెందినమోర్తా కొండయ్య కుటుంబానికి రూ.25వేలు అందించారు. అనంతరం ప్రత్తిపాడు మార్చురీ వద్దకు చేరుకుని చనిపోయిన సోమవరం గ్రామానికి చెందిన మోర్తా ఆనందరావు కుటుంబానికి, ఏలేశ్వరం గ్రామానికి చెందిన కాకాడ రాజు కుటుంబానికి 25 వేల రూపాయలు చొప్పున అందజేశారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించి, జిజిహెచ్ సూపర్డెంట్ ని కలుసుకుని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, జంపన రవివర్మ, మంచి కంటి శ్రీను, జ్యోతుల కోటేశ్వరరావు, జంపన చిరంజీవి తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయంగా రూ.25వేలు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
















Leave a Reply