విలీనం పై హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేత పట్టాభి
పెద్ద ఎత్తున హాజరై వేగుళ్ళను సన్మానించిన కౌన్సిలర్లు
మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లా కేంద్రంగా గల తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పై అభినందనల వర్షం కురుస్తోంది. మండపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఎమ్మెల్యే వేగుళ్ళ నివాసానికి వెళ్ళి ఆయనకు అభినందనలు తెలిపారు. కేవలం వేగుళ్ళ కృషితోనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్థాయిగా నిలిచిపోతుందని పట్టాభి పేర్కొన్నారు. అలాగే పలు వార్డుల కౌన్సిలర్లు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్యే వేగుళ్లకు అభినందనలు తెలిపారు. పూల దండలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. 2 లక్షల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, పలు వార్డుల కౌన్సిలర్లు, వైసీపీ నేతలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
















Leave a Reply