Advertisement

డాక్టర్ శశిధర్ ను సత్కరించిన పిఎంపిలు

మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా) డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో మండపేట శ్రీ వరదా స్కాన్ డయాగ్నస్టిక్ కు చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ శశిధర్ ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అద్యక్షుడు కోన సత్యనారాయణ దుశ్శాలువాతో, పూలమాలలు వేసి సత్కారం చేసి అసోసియేషన్ 60 సంవత్సరాల సావనీర్ ను అందజేశారు. ఈ సందర్భంగా కోన సత్యనారాయణ మాట్లాడుతూ 1895 నవంబరు 8న ఎక్సరే జర్మన్ శాస్త్రవేత్త విల్హల్మ్ కాన్రాడ్ రాంట్జెన్ కనుగొన్నారని, ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారని యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ (ఐఎస్సార్) రేడియాలజీ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ కలిసి సంయుక్తంగా 2012లో ఈ దినోత్సవం ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 పైగా జాతీయ ఇతర సంస్థలు అంతర్జాతీయ రేడియాల దినోత్సవం జరుపుకుంటారని, ఆరోజునే దేశవ్యాప్తంగా రేడియాలజీ దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అద్యక్షుడు బల్లా వెంకటరమణ, మండల కోశాధికారి వానపల్లి కనకరాజు, మండిపూడి చంద్రశేఖర్, పి.సతీష్, శివ, శ్రీను, పుచ్చలకాశీ, గాలింకి నాగేశ్వరరావు, త్రిమూర్తులు, అచ్చియ్య తదితర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *