గోవిందపురం, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి 69వ అథ్లెటిక్స్ స్కూల్ గేమ్స్ పోటీలు వజ్రపుకొత్తూరు మండలం పూండి గోవిందపురం హైస్కూల్లో అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగాయి. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని వారి యొక్క ఆట తీరులో ప్రతిభను కనబర్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జబాబు రావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు, జాతి సమైక్యతకు దోహదపడుతుందని అన్నారు. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారంటే వారి వెనుక పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు కృషి ఎంతో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అథ్లెటిక్స్ సిబ్బంది, హై స్కూల్ ఉపాధ్యాయులు మరియు వజ్రపు కొత్తూరు మండలంలో వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
69 వ రాష్ట్ర అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ స్కూల్ క్రీడా పోటీలను ప్రారంభించిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు
















Leave a Reply