జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 08 : మొంథా తుపాను సమయంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం గోదావరి భవన్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలకు తరలింపు తదితర కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం చురుకుగా వ్యవహరించిందన్నారు. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించాలన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి ప్రస్తుతం ఉన్న పోలీస్ భద్రతా సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించాలన్నారు. అలాగే కొత్తపేటలో డివిజనల్ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణం నిమిత్తం మార్కెట్ యార్డు స్థలాన్ని మంజూరు చేయాలని ఆయన కోరారు.
















Leave a Reply